woman cop
-
పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!
సాక్షి,హైదరాబాద్: నగరంలో పని చేసే పోలీసు అధికారిణికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొన్నాళ్లుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి అశ్లీల ఫొటోలు పంపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడి కోసం కేరళకు వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అరెస్టుకు అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేసి సరిపెట్టారు. రాష్ట్ర మహిళ భద్రత విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా (ఏఎస్సై) ఓ అధికారిణికి కొన్ని రోజులుగా గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. తొలినాళ్లల్లో యాదృచ్ఛికంగా జరిగిందని భావించిన ఆమె సందేశాలతోనే మందలించారు. అయినప్పటికీ ఈ వేధింపులు ఆగకపోవడంతో తీవ్రంగా పరిగణించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాధారణ మహిళలపై జరిగే నేరాలనే సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఓ పోలీసు అధికారిణే బాధితురాలిగా మారడంతో కేసు దర్యాప్తునకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నిందితుడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక బృందంతో బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టిన ప్రత్యేక బృందం సోమవారం అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో నిందితుడు ఉండే ప్రాంతానికి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం చేరుకుంది. అక్కడ అతగాడి పరిస్థితి చూసిన నగర అధికారులు అవాక్కయ్యారు. మహిళ ఏఎస్సైకి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపుతున్న వ్యక్తి చిన్న గుడిసెలో నివసిస్తున్న మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. దీనికి తోడు మూగ–చెవిటి వ్యక్తి కావడంతో కుటుంబీకులు సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అత్యవసర సమయంలో తమకు సంప్రదించడానికి ఇలా చేశారు. అయితే ఈ ఫోన్‌ను వినియోగించే సదరు నిందితుడు అనేక మందికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నాడని తేలింది. అతడి ఫోన్ పరిశీలించిన అధికారులు అందులో అనేక ఫొటోలు, వీడియోలు గుర్తించారు. ఈ విషయం నిందితుడి కుటుంబీకులకు తెలిపారు. వారి సాయంతో ప్రశ్నించగా... తనకు మహిళ ఏఎస్సై ఎవరో తెలియదని, ఏదో ఒక ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని ఇలా పంపిస్తుంటానని నిందితుడు చెప్పాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అనేక సమస్యలు వస్తాయని కుటుంబీకులను పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. -
మహిళా ఇన్స్పెక్టర్కు రూ.లక్ష జరిమానా
చెన్నై : ఫిర్యాదుకు లంచం తీసుకోవడంతో పాటు మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన మహిళా ఇన్స్పెక్టర్కు రూ.లక్ష జరిమానాను మానవ హక్కుల కమిషనర్ విధించింది. విల్లుపురం జిల్లా ఇరుందై గ్రామానికి చెందిన సుందరి. ఈమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో 2017లో కొందరు తనపై దాడి చేసినట్టు, దీంతో తను అప్పటి తిరువళ్లూరు సీఐగా వున్న ఎలిలరసి వద్ద ఫిర్యాదు చేశాను. ఆమె కేసు నమోదు చేయడానికి ఐదువేలు లంచం అడిగారు. లంచం తీసుకున్నప్పటికీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశానని, 2018వ సంవత్సరంలో ఇంట్లో చొరబడి ఇన్స్పెక్టర్ ఎలిలరసి తనపై దాడి చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించి వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈ కారణాలతో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యా దును పరిశీలించిన న్యాయమూర్తి జయచంద్రన్ సాక్షాలను, ఆధారాలను పరిశీలించి మానవ హక్కులను అతిక్రమించిన ఇన్స్పెక్టర్ ఎలిలరసికి రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా రైల్వే స్టేషన్లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’) మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్పీఎఫ్ జవాన్ పాల ప్యాకెట్ కొని తెచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! ) दिनांक 14 जून 2020 को हटिया रेलवे स्टेशन पर ट्रेन संख्या 06563 बेंगलुरु से गोरखपुर जाने वाली श्रमिक स्पेशल ट्रेन का सुबह 06:00 बजे आगमन हुआ. इस ट्रेन से यात्रा कर रही एक महिला यात्री (नाम- मेहरून्निसा )ने स्टेशन पर कार्यरत रेल सुरक्षा बल की महिला कर्मचारी ASI, श्रीमती 1/2 pic.twitter.com/KVj52XEYZp — DRM Ranchi (@drmrnc) June 14, 2020 -
‘శ్వేత నీ లాంటి కుమార్తెలుండటం గర్వకారణం’
భోపాల్: ఖాకీల కరుకు గుండెల్లో కూడా మానవత్వం ఉంటుందని నిరూపిస్తున్న సంఘటనల్ని ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీసు అనాథ అయిన ఓ వృద్ధురాలికి బట్టలు తొడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. కుటుంబ సభ్యులు వదిలేయడంతో.. ఆ తల్లి అనాథలా మారింది. ఆకలితో అలమటించే పేగులకు ఇంత ముద్ద దొరికితే అదే భాగ్యం అనుకునే ఆ తల్లి బట్టల గురించి ఆలోచించడం అత్యాశే అనుకుంది. ఈ క్రమంలో ఒంటి మీద సరైన బట్టలు లేక అవస్థ పడుతున్న ఆ తల్లిని చూసి శ్వేతా శుక్లా అనే మహిళా పోలీసు అధికారి హృదయం ద్రవించింది. దాంతో కొత్త బట్టలు, చెప్పుల తెచ్చి మరో ఉద్యోగిని సాయంతో ఆ ముసలమ్మకు తొడిగించింది. అధికారి ఆప్యాత చూసి ఆ ముసలి తల్లి కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా.. ‘నా కడుపున పుట్టిన వారికి నేను భారమయ్యాను. ఇలా ఒంటరిగా అనాథలా వదిలేశారు. ఏ తల్లి కన్న బిడ్డవో.. నా కోసం ఇంత ఆప్యాయంగా బట్టలు తెచ్చావు’ అంటూ శ్వేతను పట్టుకుని ఏడ్చింది ఆ వృద్ధురాలు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘శ్రద్ధా శుక్లా లాంటి కుమార్తెలను చూసి మధ్యప్రదేశ్ గర్విస్తోంది. కుమార్తెలు ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకుంటారు. ఇంటికి కొత్త కాంతిని తీసుకువస్తారు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. చాలా గొప్ప పని చేశారు’ అంటూ నెటిజన్లు శ్వేతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఈ టిక్‌టాక్ దీవానీని గుర్తుపట్టారా?
టిక్ టాక్ వీడియోతో ఉద్యోగం పోగొట్టుకున్న గుజరాత్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్పితా చౌదరి గుర్తున్నారా? ప్రస్తుతం ఇపుడు ఈమె ఉద్వాసనలు, హెచ్చరికలను పక్కన పెట్టి తనకిష్టమైన రంగంలో రాణించేందుకు సిద్ధమవుతోంది. పోలీస్ స్టేషన్లో టిక్‌టాక్ వీడియో చేయడంతో పై అధికారుల ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరో వీడియోతో హల్ చల్ చేస్తోంది. సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది. టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియోకు 20లక్షల 50వేలకు పై గా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ పాటను జిగ్నేష్ కవిరాజ్ పాడగా.. మయూర్ నదియా సంగీతం అందించాడు. మను రబారి లిరిక్స్‌ను రాశాడట. చదవండి : టిక్‌టాక్ వీడియో; మహిళా పోలీసు సస్పెండ్! -
గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన నయనతార ఫొటో
పట్నా: బిహార్ మహిళా పోలీసు అధికారి ఒకరు భయంకరమైన గ్యాంగస్టర్‌ను పట్టుకునేందుకు ఏకంగా టాప్ హీరోయిన్ను వాడేసుకున్నారు. ప్రముఖ దక్షిణ భారతీయ సినీ హీరోయిన్ ఫోటోతో చాకచక్యంగా హనీట్రాప్ విసిరి ఓ కరుడు కట్టిన నేరస్తుడి ఆటకట్టించిన వైనం ఆసక్తికరంగా మారింది. దర్భంగా జిల్లా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని దర్భాంగా జిల్లాలో బీజేపీ సంజయ్ కుమార్ మహతోకు చెందిన ఖరీదైన మొబైల్ ఫోన్ ఇటీవల చోరీకి గురైంది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారి మధుబాలదేవికి అప్పగించారు అధికారులు. విచారణ సందర్భంగా గ్యాంగ్‌స్టర్ మహమ్మద్ హస్నయిన్ ఈ మొబైల్ వాడుతున్నట్టుగా గుర్తించారు. అతడి కాల్ లిస్ట్ ఆధారంగా వలపన్నిన మధుబాల చివరి నిమిషంలో మహ్మద్ తప్పించుకోవడంతో పలు సార్లు విఫలమయ్యారు. ఇక్కడే మధు బుర్రలో ఓ స్మార్ట్ ప్లాన్ రూపుదిద్దుకుంది. హీరోయిన్ నయనతార ఫోటోను తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని..నకిలీ ప్రేమ నటిస్తూ అతగాడికి మెసేజ్‌లు పెట్టింది. మొదట్లో నిరాకరించినా, నయనతార ఫోటో చూసిన ఫ్లాట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ..చివరకి హనీట్రాప్‌లో ఇరుక్కున్నాడు. దర్భంగా టౌన్లో కలవాలని ప్రతిపాదించాడు. సరిగ్గా దీనికోసమే ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ పోలీసు చాకచక్యంగా అతగాడికి చెక్ పెట్టింది. అయితే ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే..మహ్మద్ నేరాన్ని ఒప్పుకున్నాడు కానీ తను వాడుతున్న మొబైల్ వేరే నేరస్తుడి నుంచి రూ.4500 కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ నేరస్తుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటో చూసి బుక్కయ్యాడని.. బురఖాలో వెళ్లి.. ఇతర పోలీసులు సహాయంతో అతనిని అరెస్టు చేశామని మధుబాల చెప్పారు. మరోవైపు అధికారి మధుబాలకు పోలీసు శాఖ రివార్డ్ ప్రకటించింది. -
మంత్రితో వాగ్వాదం.. మహిళా ఐపీఎస్‌పై వేటు!
చండీగఢ్: హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌తో వాగ్వాదం చేసిన మహిళా పోలీస్ అధికారిణిపై చర్యలు తీసుకున్నారు. ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియాపై బదిలీ వేటు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివరాలిలా ఉన్నాయి. మంత్రి అనిల్ విజ్.. ఫతేహబాద్ జిల్లా గ్రీవెన్స్, ప్రజా సంబంధాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియా వచ్చారు. జిల్లా పరిధిలోని గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాలపై ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ఎస్పీని ప్రశ్నించారు. ఏడాదిగా ఎక్సైజ్ చట్టం కింద దాదాపు 2500 కేసులు నమోదు చేసినట్టు ఆమె వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి.. మద్యం మాఫియాతో పోలీసులకు సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రభుత్వ వ్యవహారమని, మద్యం అమ్మకాలకు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమేనని ఎస్పీ ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను ఆదేశించారు. అందుకు ఎస్పీ తిరస్కరించడంతో మంత్రి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు ఆయన్ను అనుసరించారు. మంత్రి ఈ విషయాన్ని హరియాణా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీపై బదిలీ వేటు వేసినట్టు సమాచారం. -
మహిళా పోలీస్‌పై అత్యాచారం
భోపాల్: ఓ మహిళ కానిస్టేబుల్‌ను అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కాశీరాం పచొలెపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తామిద్దరి మధ్య మూడేళ్లుగా పరిచయమున్నట్టు బాధితురాలు చెప్పింది. అయితే కాశీరాంకు పెళ్లయిన విషయాన్ని తన దగ్గర దాచాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో నమ్మించి ఉజ్జయినిలోని ఓ హోటల్లో తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పింది. కేసు నమోదు చేశామని, విచారణాంతరం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. -
మహిళా పోలీసులకే రక్షణ కరువు !
న్యూఢిల్లీ: నగరంలో మహిళా పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ ఢిల్లీలోని మయాపురి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ విధులు ముగించికొని ఇంటికి తిరిగి వస్తుండగా 20 ఏళ్లలోపు ముగ్గురు యువ కులు ఆటకాయించి అసభ్యంగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా ఆమె చేతిని పట్టుకొని లైంగిక దాడికి ప్రయత్నించారు. మహిళా పోలీస్ ఆ ముగ్గురి యువకులపై తిరగబడింది. అరుపులు, కేకలు వేయడంతో యువకులు పరారీ అయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకొన్నదని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చే యించారు. నిందితులు ముగ్గురు బాధితురాలి ఇరుగుపొరుగు కావడంతో, కొందరు స్థానికులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించడంతో ఫిర్యాదు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అక్కడితో స్థానికంగా తెరపడింది. ఎఫ్ఐఆర్ కొట్టివేత: కానీ, పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఢిల్లీ హైకోర్టుకు అందజేశారు. బాధితురాలు ఉపసంహరించుకోవడంతో జస్టిస్ ప్రతిభా రాణి నేతృత్వంలోని ధర్మాసనం ఎఫ్ఐఆర్ను కొట్టివేసంది. సంఘటన తీరుపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో సాధారణ మహిళపైనే కాకుండా మహిళా పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయిందని పేర్కొంది. మహిళా పోలీసును అవమానించిన యువకులకు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఒక మహిళా పోలీసు నగరంలో వీధుల్లో నడుచుకొంటూ వెళ్లే పరిస్థితి లేదు..సాధారణ మహిళలు, యువతుల పరిస్థితి ఏమిటని’ ప్రశ్నించింది. పోలీసులు నివేదికపై ఇలా..: డిసెంబర్ 16, 2012లో మహిళపై సామూహిక లైంగిక దాడి ఘటన సంచలనం సృష్టించింది. అప్పట్లో మహిళలపై నేరాల సంఖ్య 35 శాతంగా నమోదు అయ్యింది. ఈ ఏడాది 1,794 అత్యాచార సంఘటనలు జరిగాయి. గతేడాది 1,330 కేసులుండగా ఈ సంవత్సరం పెరిగాయి. మొత్తంగా నగరంలో మహిళలపై నేరాల సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందని ఇటీవల ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా మహిళ పట్ల అసభ్యంగా వ ్యవహరించడం, రాగింగ్‌కు పాల్పడిన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు 3,450 కేసులు, రాగింగ్‌కు పాల్పడినందుకు 1,024 కేసులు నమోదయ్యాయి. గతేడాది 2,544, 739 కేసులు నమోదు అయ్యాయి నివేదిక తెలియజేసిందని కోర్టు తెలియజేసింది. కేసు ఉపసంహరణపై ఆక్షేపణ ‘అయినప్పటికీ మహిళా పోలీసు కానిస్టేబుల్ కూడా నిందితులకు ఎలాంటి గుణపాఠం చెప్పలేకపోయిందని జడ్జి పేర్కొన్నారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినా ఏమి చేయలేకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. నిందితులకు సరైన గుణపాఠ చెబితే..మరోసారి ఇలాంటి దురాఘతానికి పాల్పడడానికి భయపడుతారు. ‘ ఢిల్లీ వీధుల్లో మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏమిట’ని ఎఫ్ఐఆర్ కొట్టెస్తూ జస్టిస్ ప్రతిభారాణి ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకడిని ఎఫ్ఐఆర్ చదువాలని కోర్టు ఆదేశించగా, సంశయం వ్యక్తం చేశాడు. ‘ ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించేటప్పుడు సిగ్గు అనిపించనప్పుడు? ఎఫ్ఐఆర్ చదవడానికి ఎందుకు సిగ్గు పడుతున్నావని జస్టిస్ ప్రశ్నించారు. ప్రస్తుతం జరిగిన విషయాన్ని తేలికగా తీసుకోవద్దని నిందితులను హెచ్చరించారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే విచారణకు నిందితులు వారి తల్లిదండ్రులను కూడా తీసుకొని రావాలని ఆదేశించారు. -
భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు
ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ శక్తిదేవి(38)కి అవార్డు ప్రదానం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో సాధించిన విజయాలు... అఫ్ఘానిస్థాన్లోని పలు ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది.