భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు | jammu and kashmir woman cop honoured with UN award | Sakshi
Sakshi News home page

భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు

Published Wed, Oct 15 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు

భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు

ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి(38)కి అవార్డు ప్రదానం చేశారు.

అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో సాధించిన విజయాలు... అఫ్ఘానిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement