Shocking: Tik Tok Star Molested Minor Girl In Mumbai With His Friends - Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ స్టార్‌ల మధ్య రచ్చ.. లైంగికంగా వేధించి.. ఆపై

Published Wed, Aug 4 2021 8:48 PM | Last Updated on Thu, Aug 5 2021 12:01 PM

TikTok Star Two Friends Booked For Molested Minor Girl In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ఇద్దరు మైనర్‌ టిక్‌టాక్‌ స్టార్‌ల మధ్య గొడవ లైంగిక వేధింపులకు దారితీసింది. నాతో కలిసి ఉండకపోతే.. నీ వ్యక్తిగత వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ సదరు టిక్‌టాక్‌ స్టార్‌..  మైనర్‌ బాలికను వేధించాడు. ప్రస్తుతం ఈ ఘటన మహరాష్ట్రాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు..ముంబైలోని 16 ఏళ్ల యువకుడు టిక్‌ టాక్‌ వీడియోలను చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుండేవారు. కాగా,  2020 లో టిక్‌టాక్‌ బాన్‌కాక ముందు నుంచే వీరిద్దరు కలసి పనిచేసేవారు. వీరిద్దరికి కూడా సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ క్రమంలో, వీరిద్దరు కలిసి అనేక వీడియోలను చేశారు.

కొంత కాలం వీరి స్నేహం బాగానే సాగింది. ఆ తర్వాత.. వీరిమధ్య కొన్ని మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో గతవారం.. 17 ఏళ్ల యువతి, తాను సొంతంగా వేరే బిజినెస్‌ చేయాలనుకుంటున్నట్లు యువకుడికి తెలియజేసింది. దీంతో, ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతోనే కలిసి ఉండాలని కోరాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అతను, యువతిని ప్రతిరోజు మానసికంగా హింసించేవాడు. ఆమె వ్యక్తిగత వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతొ ఆమె..  అతని వేధింపులకు విసిగి పోయింది.

ఒకరోజు రాత్రి యువకుడు.. యువతి ఇంటికి తన మిత్రులతో కలిసి వెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు.  ఈ అనుకోని సంఘటనతో భయపడిపోయిన ఆ యువతి తన తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు, ముంబైలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ యువకుడు, అతని మిత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement