ఈ వారం యూట్యూబ్‌ హిట్స్ | this week Youtube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

Published Sun, Feb 7 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

పుస్సీ రాయ్ట్ - చైకా : మ్యూజిక్ వీడియో
నిడివి : 2 ని. 52 సె.
హిట్స్ : 14,11,823
రష్యన్ జనరల్ ప్రాసిక్యూటర్ యూరి చైకాకు నేర ప్రపంచంతో ఉన్న అవినీతి, అక్రమ సంబంధాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రష్యాలోని ‘పుస్సీ రాయ్ట్’ అనే ఫెమినిస్టు పంక్ రాక్ గ్రూపు తయారు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆ దేశంలో సంచలనం రేపుతోంది. అలాగని ఇది చూడడానికి మరీ నిస్సారమైన వీడియో ఏమీ కాదు.

సామాజిక సందేశంతో పాటు, హాస్యం, వ్యగ్యం, స్పైస్ కూడా ఇందులో కలగలసి ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ మీ చేత లయబద్ధంగా దేశభక్తి నాట్యాన్ని చేయిస్తుంది. దేశభక్తి ఏ దేశంలోనైనా ఒకటే కదా. ‘విధేయంగా ఉండు.. ఒదిగి ఉండడం నేర్చుకో. లౌకిక విషయాల గురించి ఆలోచించకు. అధికారంలో ఉన్నవారికి అణకువతో ఉండు. ఎందుకంటే ఆ అధికారం దేవుడిచ్చిన కానుక’ అంటూ సెటైరికల్‌గా సాంగ్ సాగుతుంది.
 
మి బిఫోర్ యు : ట్రైలర్
నిడివి : 2 ని. 47 సె.
హిట్స్ : 13,49,169
ఇంగ్లండ్ రచయిత్రి జోజో మోయజ్ నవల ‘మీ బిఫోర్ యూ’ ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ని రెండు రోజుల క్రితమే యు.కె.లోని వార్నర్ బ్రదర్స్ కంపెనీ అప్‌లోడ్ చేసింది. వాలెంటైన్స్ డే వేళ కావడంతో ఈ ప్రేమకథా చిత్రం ప్రేయసీ ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ ఇది విడుదల కాబోతున్నది మాత్రం జూన్ (3)లో.
 
‘లివ్ బోల్డ్‌లీ’ అనే సందేశాన్నిచ్చే ఈ చిత్రం అంతా పూర్తిగా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా గొప్ప ప్రేమ వరంలా లభిస్తుంది. జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది.. అనే అద్భుతమైన థీమ్‌తో తయారౌతున్న ‘మీ బిఫోర్ యూ’ చిత్రం ట్రైలర్ కూడా అంతే అద్భుతంగా ఉంది.
 
పప్పీస్ ప్రిడిక్ట్ సూపర్ బౌల్ 50
నిడివి : 2 ని. 31 సె.
హిట్స్ : 7,66,219
జిమ్మీ ఫాలెన్ ‘ది టునైట్ షో’లోని పప్పీ ప్రిడిక్టర్స్ గేమ్ ప్రోగ్రామ్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆట పేరు ‘సూపర్ బౌల్ 50 ఎడిషన్’. ఇందులో రెండు జట్లు ఉంటాయి. కరోలినా పాంథర్స్, డెన్వర్ బ్రాంకస్. జట్లు అంటే బౌల్స్ అన్నమాట. అలాగే ఇందులోని ఆటగాళ్లు తొమ్మిది పప్పీలు. రెండు బౌల్స్‌లో పప్పీ ఫుడ్ ఉంటుంది.

ఈ తొమ్మిది పప్పీలు ఈ బౌల్స్‌కి దూరంగా ఒక అర లాంటి ప్రదేశంలో ఉంటాయి. జిమ్మీ ఫాలెన్ వచ్చి వాటిని గెట్.. సెట్.. గో.. అంటూ ఒకేసారి బౌల్స్ వైపు వదిలేస్తాడు. వాటిలో ఏ బౌల్‌పై ఎక్కువ సంఖ్యలో పప్పీలు ఎగబడి తింటాయో ఆ బౌల్ పేరున్న జట్టు గెలిచినట్టు. ఇంట్రెస్టింగ్ కదా! ఇంతకీ ఏ జట్టు గెలిచింది? వీడియో చూడండి మజా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement