షూటింగ్ లో కాల్పులు: నటుడు మృతి | Actor fatally shot while filming music video in Brisbane | Sakshi
Sakshi News home page

షూటింగ్ లో కాల్పులు: నటుడు మృతి

Published Mon, Jan 23 2017 12:15 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

షూటింగ్ లో కాల్పులు: నటుడు మృతి - Sakshi

షూటింగ్ లో కాల్పులు: నటుడు మృతి

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది.  ఆస్ట్రేలియన్ రాష్ట్రమైన క్వీన్స్‌లాండ్  రాజధాని నగరంలో  ఒక మ్యూజిక్ వీడియో చిత్రీకరణలో అపశృతి దొర్లింది. ఒక బార్ లోపల ప్రమాదకరమైన షూటింగ్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో జరిగిన కాల్పుల్లో నటుడు(20)  ప్రాణాలు కోల్పోయాడు  బ్రిస్బేన్ లోని ఈగల్ లేన్ లో  ఈ  ప్రమాదం సంభవించింది.  

తుపాకులు, మందుగుండు సామాన్లు, ఇతర  ఆయుధాలతో షూటింగ్  సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని  స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.  ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో  ఛాతీలోబలమైన గాయం కారణంగా అతడు చనిపోయినట్టు  క్వీన్స్ లాండ్ పోలీసులు చెప్పారు. అయితే మిగిలిన  నటులకు  ఎలాంటి ప్రమాదం సంభవించలేదని  డిటెక్టివ్ ఇన్సెక్టర్ అధికారి టామ్ తెలిపారు.    అయితే షూటింగ్ లోఉపయోగించిన ఆయుధాలు నిజమైనవా, నకిలీవా అనేది దర్యాప్తు  చేస్తున్నామన్నారు. అయితే ఇది ప్రమాదమా.. కాదా అనేది ఇపుడే తేల్చలేమని చెప్పారు. షూటింగ్ లో ఉపయోగించిన ఆయుధాలు నిజమైనవా, నకిలీవా అనేది దర్యాప్తు  చేస్తున్నామన్నారు.మరోవైపు   ఈగల్ లేన్ బార్ ను సోమవారం మూసివేస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా  బార్  యజమానులు ప్రకటించారు.

పోలీసుల విచారణ  కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  చెప్పారు. కాగా  స్థానికుల సమాచారం ప్రకారం ప్రముఖ హిప్-హాప్ బృందం ఆధ్వర్యంలో మ్యూజిక్  వీడియోను షూట్ చేస్తుండగా కాల్పులు శబ్దం వినిపించింది. అనేక మంది ఇతర నటులు కూడా ఈ షూటింగ్  లో  పాల్గొన్నారు.   చిత్రీకరణ సమయంలో పెద్ద మొత్తంలో మందుగుండును  పేల్చినట్టు  తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement