
విజయ్ దేవరకొండ
టీజర్ వదిలిన నెలకు అన్ని గేర్లు వేసి థియేటర్‌లో ఫుల్ పిక్చర్ చూపిస్తానంటున్నాడు ‘టాక్సీవాలా’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా జీఏ2, యూవీ పిక్చర్స్ పతాకాలపై సంకృత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన సినిమా ‘టాక్సీవాలా’. ఇందులో ప్రియాంక జవాల్కర్ కథానాయిక. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
‘‘ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఉంటుంది. విజయ్ మ్యానరిజమ్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం. మే 18న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. మాళవిక నాయర్, కల్యాణి, మధునందన్, సిజ్జు మీనన్ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజాయ్.
Comments
Please login to add a commentAdd a comment