
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించకపోవటంతో ముందుగా ప్రకటించిన సమయానికి టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినా.. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావటానికి మరింత సమయం పట్టనుందట. అందుకే సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇంతవరకు ప్రమోషన్ హడావిడి కనిపించకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక జువాల్కర్, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.