Taxiwala Review, in Telugu | ‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ | Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

Published Sat, Nov 17 2018 12:02 PM | Last Updated on Sat, Nov 17 2018 5:23 PM

Vijay Devarakonda Taxiwaala Telugu Movie Review - Sakshi

టైటిల్ : టాక్సీవాలా
జానర్ : సూపర్‌ నేచురల్‌ కామెడీ
తారాగణం : విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌, కళ్యాణీ, ఉత్తేజ్‌
సంగీతం : జాక్స్‌ బెజోయ్‌
దర్శకత్వం : రాహుల్ సాంక్రుత్యాయన్‌
నిర్మాత : ఎస్‌కేయన్‌

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్‌ లో రిలీజ్ కావటంతో రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్‌ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..?
 

కథ ;
శివ (విజయ్‌ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్‌ ట్రై చేసిన వర్క్‌ అవుట్ కాకపోవటంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథతో అను (ప్రియాంక జవాల్కర్‌), శిశిర (మాళవిక నాయర్‌)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
విజయ్‌ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్‌, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌  సన్నివేశాల్లో విజయ్‌ నటన సూపర్బ్‌ అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్‌ రోల్‌ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్‌ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్‌, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

విశ్లేషణ ;
తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్న దర్శకుడు రాహుల్‌, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్‌ నేచురల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో తయారు చేసుకున్న లైన్‌ కావటంతో లాజిక్‌ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్‌ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్‌ హాఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గినా మార్చురీ సీన్‌ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్‌ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్‌ సారంగ్‌ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు.  ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
విజయ్‌ దేవరకొండ
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ ;
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
పాటలు
గ్రాఫిక్స్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement