
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డీలే కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా మరో కొత్త డేట్‌ను ప్రకటించారు టాక్సీవాలా టీం. అయితే అదే రోజు రవితేజ, శ్రీనువైట్ల కాబింనేషన్‌లో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటొని కూడా రిలీజ్ అవుతుండటంతో విజయ్ కాస్త వెనక్కి తగ్గాడు. ఒక్క రోజు ఆలస్యంగా నవంబర్ 17న టాక్సీవాలా సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా కొత్త రిలీజ్ డేట్‌ను పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.
Release date announcement -#Taxiwaala will now arrive Nov 17!
— Vijay Deverakonda (@TheDeverakonda) 4 November 2018
Driver arriving a day late, but driver promises a fun ride to the destination! pic.twitter.com/BRuOBmwxL7