
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
టాక్సీవాలా సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ‘అమర్ అక్బర్ ఆంటొని’తో నిరాశపరిచిన రవితేజ త్వరలో విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మరో హీరోయిన్‌గా ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment