విజయ్‌కి సక్సెస్‌ కొత్త కాదు | Allu Aravind Praises Vijay Devarakonda at Taxiwaala | Sakshi
Sakshi News home page

విజయ్‌కి సక్సెస్‌ కొత్త కాదు

Published Sun, Nov 18 2018 3:43 AM | Last Updated on Sun, Nov 18 2018 3:43 AM

Allu Aravind Praises Vijay Devarakonda at Taxiwaala - Sakshi

బన్నీ వాసు, వంశీ, ప్రియాంకా, అల్లు అరవింద్, రాహుల్, విజయ్, మారుతి, ఎస్‌కేయన్‌

‘‘మేమంతా వెనకుండి కేవలం సపోర్ట్‌ చేశాం. ‘టాక్సీవాలా’ విజయం యూనిట్‌ సమిష్టి కృషి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. విజయ్‌ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్‌ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘టాక్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌కి సక్సెస్‌ కొత్తేమీ కాదు. అతను చాలా సక్సెస్‌లు అందుకున్నాడు. నిర్మాత ఎస్‌కేఎన్‌కు ఇది తొలి విజయం. త్వరలో సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా పైరసీ అయినప్పుడు కొత్త టీమ్‌ కదా అని బాధపడ్డాను. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్‌ గురించి చెప్పినప్పుడు వంశీ నాకు విజయ్‌ దేవరకొండని సజెస్ట్‌ చేశాడు. రాహుల్‌ చాలా కొత్తగా తీశాడు. ఇంత హైప్‌ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు మారుతి.

‘‘ఆడియో ఫంక్షన్‌లో థియేటర్స్‌ని నింపమని ప్రేక్షకులను కోరాను. అలా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. సపోర్ట్‌ చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘ఈ సినిమా టెక్నికల్‌గా సక్సెస్‌ అయ్యింది అంటున్నారు. అందుకే నా టెక్నికల్‌ టీమ్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నాను. వంశీగారు, బన్నీగారు, మారుతిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు రాహుల్‌. ‘‘అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, వంశీ, బన్నీలకు థ్యాంక్స్‌. సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’అన్నారు ఎస్‌కేఎన్‌. ‘‘ౖపైరసీ అయిన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్‌ రావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నవారందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు ప్రియాంక జవాల్కర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement