టాక్సీవాలా రీమేక్‌ | vijay devarakonda taxiwala hindi remake | Sakshi
Sakshi News home page

టాక్సీవాలా రీమేక్‌

Published Tue, Oct 22 2019 5:53 AM | Last Updated on Tue, Oct 22 2019 5:53 AM

vijay devarakonda taxiwala hindi remake - Sakshi

ఇషాన్‌ కట్టర్‌

పాత కారు, అందులో దెయ్యం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విజయ్‌ దేవరకొండ చిత్రం ‘టాక్సీవాలా’. రిలీజ్‌కు ముందే పైరసీ అయినప్పటికీ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్‌ అవుతోందని సమాచారం. బాలీవుడ్‌ యంగ్‌ హీరో, షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ కట్టర్‌ హీరోగా ‘కాలీ పీలీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనన్యా పాండే హీరోయిన్‌. మక్బూల్‌ ఖాన్‌ దర్శుకుడు. ఈ సినిమాలో టాక్సీ కూడా ప్రధాన పాత్ర అని సమాచారం. తాజా సమాచారం ఏంటంటే ‘కాలీ పీలీ’ చిత్రం ‘టాక్సీవాలా’ చిత్రం ఆధారంగా రూపొందుతోందని తెలిసింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్‌. ఇషాన్‌ గత సినిమా ‘ధడక్‌’ కూడా మరాఠీ సినిమాకు రీమేకే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement