
‘గీతగోవిందం’తో సక్సెస్ తరువాత వెను వెంటనే ‘నోటా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు నిరాశే మిగిలింది. మాస్ మహారాజ రవితేజ గతకొంతకాలం నుంచి సరైన విజయాలు లేక డీలా పడ్డాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు వచ్చే నెలలో పోటీపడనున్నారు.
పలు వాయిదాల అనంతరం విజయ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సీవాలా’ ఎట్టకేలకు నవంబర్ 16న విడుదల కానున్నట్లు ప్రకటించారు. వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో అమర్ అక్బర్ ఆంటొని కూడా నవంబర్ 16నే వస్తుంది. ఇవి రెండు ఒకే తేదీన విడుదల అవుతున్నందున అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం విజయ్ హవా నడుస్తున్న తరుణంలో టాక్సీవాలాపై అంచనాలు ఉన్నా.. పోస్టర్స్, టీజర్స్‌తో ‘అఅఆ’పై కూడా అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. మరి ఈ రెండింటిలో ప్రేక్షకులను ఏది మెప్పిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment