
ఇటీవల హీరోయిన్ అను ఇమ్మాన‍్యూల్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చినా వదులుకుంది.
తాజాగా ఈ బ్యూటీ ఓ యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తరువాత పరుశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూల్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment