
టాక్సీవాలా చిత్రం శనివారం విడుదలవుతున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండకి, చిత్ర యూనిట్‌కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మీ దగ్గర్లో ఉన్న థియేటర్లలో టాక్సీవాలా చిత్రాన్ని చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులను కోరారు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘అన్నా... ముందు మాకు సాహో అప్‌డేట్ ఇవ్వండన్నా’ అంటూ ప్రభాస్‌కు బదులిచ్చారు.
టాక్సీవాలా చిత్రం విడుదల ముందే లీక్ అయిపోవడంతో చిత్ర బృందంలో మనోధైర్యం నింపుతూ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్, నిఖిల్‌లతోపాటూ పలువురు సినీ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న అల్లు అర్జున్ కూడా పైరసీ గురించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment