
‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘టాక్సీవాలా’. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అసలే అర్జున్ రెడ్డితో పాపులర్ అయిన విజయ్ మూవీలపై భారీగా అంచనాలు ఉంటున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ కలగలిపినట్లుగా ఉన్న ఈ టీజర్ చూస్తే మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తారు. సోషల్ మీడియాలో విడుదలైన మూవీ టీజర్ వైరల్ అవుతోంది.
‘టాక్సీవాలా’. ఎస్.కె.ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీకి జేక్స్ బిజాయ్ సంగీతం సమకూర్చారు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. విజయ్ మ్యానరిజమ్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాయి. విజయ్‌కి జోడీగా ప్రియాంక జవాల్కర్ కనిపించనుంది. టీజర్ విడుదలైన సరిగ్గా నెల రోజులకు (మే 18న) థియేటర్లకు రానున్నాడు టాక్సీవాలా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన మూవీలో మాళవిక నాయర్, కల్యాణి, మధునందన్, సిజ్జు మీనన్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment