సత్యదేవ్, వెంకట్, రాహుల్ సంకృత్యాన్, నాని, రాహుల్ రవీంద్రన్
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో నేనెప్పుడూ కొత్త, పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. ఇప్పటినుంచి ప్రతి సినిమాలో ఇది వరకు చూడని కొత్త నానీనే చూస్తారు’’ అని హీరో నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్‌కు వస్తున్నాను.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి కరెక్ట్ సినిమాతో వస్తున్నాను.
మంచి టీమ్ కుదిరినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ‘ఎంసీఏ’తో హిట్ సాధించాను.. ‘శ్యామ్ సింగరాయ్’కి ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను కూడా నాని అభిమానినే. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మా సినిమా ఉంటుంది’’ అని రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ‘‘నాని ఎంతో సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి వెంకట్‌గారిలాంటి నిర్మాతలు అవసరం ’’ అన్నారు నటుడు రాహుల్ రవీంద్రన్. కథా రచయిత సత్యదేవ్ జంగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట్ రత్నం (వెంకట్).
Comments
Please login to add a commentAdd a comment