
RRR Hero to join hands with Shyam Singha Roy Director: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్కన దర్శకుడు శంకర్ సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రాన్ని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు చెర్రి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే తాజా సమాచారం ఏంటంటే ఆ రెండు చిత్రాల అనంతరం 'శ్యామ్ సింగరాయ్’తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా 'శ్యామ్ సింగరాయ్’ చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment