లావణ్యకు శుభమస్తు! | Vijay Devarakonda To Romance With lavanya tripathi | Sakshi
Sakshi News home page

లావణ్యకు శుభమస్తు!

Published Tue, Jul 11 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

లావణ్యకు శుభమస్తు!

లావణ్యకు శుభమస్తు!

శుభం భుయాత్‌! ఇంకోసారి అంతా శుభమే జరగాలని లావణ్యా త్రిపాఠి ఆశిస్తున్నారు. ఎందుకంటే... అచ్చొచ్చిన నిర్మాణ సంస్థలో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారీ సుందరి! గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్‌లో లావణ్యా త్రిపాఠి చేసిన మొదటి సినిమా ‘భలే భలే మగాడివోయ్‌’ మాంచి హిట్‌. తర్వాత గీతా ఆర్ట్స్‌లో ‘శ్రీరస్తు శుభమస్తు’ చేశారు. అదీ హిట్టే. ఇప్పుడు ఇంకోసారి జీఏ2 పిక్చర్స్‌లో ఆమెకు ఛాన్స్‌ వచ్చిందట.

 ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందనున్న సినిమాలో లావణ్యా త్రిపాఠీని హీరోయిన్‌గా ఎంపిక చేశారట! ‘శ్రీరస్తు శుభమస్తు’లో ఆమె నటనకు ఇంప్రెస్‌ అయిన దర్శకుడు మరోసారి అవకాశం ఇచ్చారట. అమ్మాయిగారు ఓ సినిమా చేస్తే... ఇంకో సినిమా లాభంగా వచ్చిందన్న మాట. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో లావణ్య నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement