శత్రువుని సెలక్ట్ చేసుకున్నధృవ | Dhruva audio to be released directly into market sans music function | Sakshi
Sakshi News home page

శత్రువుని సెలక్ట్ చేసుకున్నధృవ

Published Thu, Nov 3 2016 10:36 PM | Last Updated on Sat, Aug 3 2019 1:14 PM

శత్రువుని  సెలక్ట్  చేసుకున్నధృవ - Sakshi

శత్రువుని సెలక్ట్ చేసుకున్నధృవ

‘‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును నేను సెలక్ట్ చేసుకున్నా’’ అంటున్నారు రామ్‌చరణ్. ఆయన పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. సురేందర్ రెడ్డి దర్వకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హిప్ హాప్ ఆది స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 9న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. హై బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందు మెగా అభిమానులు, ప్రేక్షకుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ . డిసెంబర్ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాం మొదటి వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అరవింద్ స్వామి, నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.యస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement