చిరంజీవిగారితో...ప్రేక్షకులకు కిక్ ఇస్తా!
రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలవుతోంది. తమిళ హిట్ ‘తని ఒరువన్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ ‘ధృవ’తో పాటు తదుపరి చిత్రాల గురించి సురేందర్‌రెడ్డి చెప్పిన ముచ్చట్లు...
► చరణ్ (రామ్‌చరణ్)తో సినిమా చేయాలనుకున్నాక ఓ కథ గురించి డిస్కస్ చేశా. ఓ రోజు ‘తని ఒరువన్’ రీమేక్ చేస్తే? ఎలా ఉంటుందన్నారు. నా అభిప్రాయాలు చెప్పా. ‘నువ్వు డెరైక్ట్ చేస్తావా?’ అని అడిగారు. ‘నేను చేయగలనా, లేదా?’ అని రెండు రోజులు ఆలోచించి ఓకే చెప్పా. కానీ, ఈ సినిమాకి ఎంత ఎంజాయ్ చేశానో... అంత కష్టపడ్డా. లైఫ్‌లో మళ్లీ రీమేక్స్ చేయను. ఎందుకంటే, మన క్రియేటివిటీ చూపించలేం. ‘ధృవ’కి మూలకథను మార్చకుండా స్క్రిప్ట్‌లో చిన్న మార్పులు చేశాం. తెలుగులో అరవింద్ స్వామి పాత్ర నిడివి కూడా తగ్గించలేదు.
►క్యారెక్టర్ కోసం ఏమైనా చేసే హీరో చరణ్. దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. ‘ధృవ’ కోసం ఆరు నెలలు జిమ్ బాడీ మెయిన్‌టైన్ చేశారు. అది చాలా కష్టం. అంతకు ముందు చరణ్ గురించి చాలా విన్నాను. కానీ, ఆయన ఓ మంచి మనసున్న వ్యక్తి. ఓ మాట ఇచ్చారంటే ఎప్పటికీ మర్చిపోరు.
► ‘జాగ్వార్’ చిత్ర ఫేమ్ అయిన కన్నడ హీరో నిఖిల్‌గౌడతో సినిమా ఆఫర్ ఉంది కానీ, చేయడం లేదు. చిరంజీవిగారితో చిత్రానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయనతో కలసి ప్రేక్షకులకు ‘కిక్’ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇస్తా. కథ రెడీగా ఉంది. వచ్చే ఏడాది కచ్చితంగా ఆ సినిమా ఉంటుంది.