ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌లోనూ ప్రావీణ్యం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణంలో.. అటు హీరోలుగా, ఇటు నిర్మాతలుగా కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మొన్న రామ్‌చరణ్, నిన‍్న విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థలు స్థాపించి కంటెంట్ బాగుంటే ఏ హీరో అయినా, ఏ దర్శకుడు అయినా, వారికి అనుభవం ఉన్నా లేకపోయినా సినిమాలు నిర్మిస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
అదే రీతిలో అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు తనకంటూ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. దానిపై సీరియస్‌గా దృష్టి కూడా పెట్టారు. ఇక అల్లు అర్జున్ పేరుతో నిర్మాణ సంస్థకు అంతా సిద్ధమని, త్వరలోనే అది ప్రారంభం కానుందని తెలుస్తోంది. తన తండ్రి అల్లు అరవింద్‌కు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా తనకంటూ ఒక బ్యానర్ స్థాపించాలనుకున్నారు. ఆ బ్యానర్‌లోనే సినిమాలను నిర్మించాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి ఆ కోరిక నిజమయ్యింది. (బిగ్‌బాస్: శృతి మించిన రొమాన్స్)
ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య క్రేజ్ పెరిగింది. సినిమాలకన్నా వెబ్ సిరీస్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారి సంఖ్య ఎక్కువైంది. అందుకే తను నిర్మాతగా ముందు ఓటీటీతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడట అల్లు అర్జున్. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో బయటికి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లు కూడా తన తండ్రి ప్రారంభించిన ఆహా యాప్‌లోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ నవంబర్10 నుంచి ప్రారంభం అవుతుండగా ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా అల్లు అర్జున్ బిజీబిజీగా గడపబోతున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment