కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెళ్లడించింది. ఈమేరకు రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో తమ పాటలను అనుమతి లేకుండా రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను పరంవా స్టూడియోపై రక్షిత్ నిర్మించారు.
రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు దానిని తొసిపుచ్చింది.
ఆపై రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలంటూ రక్షిత్ శెట్టిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ పాటలను తొలగించాలని సూచించింది. పలు కారణాల వల్ల రక్షిత్ శెట్టి ఢిల్లీ కోర్టుకు హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment