రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ వాయిదా | Rakshit Shetty Request For Anticipatory Bail Amid Copyright Infringement Charges | Sakshi
Sakshi News home page

రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ వాయిదా

Published Sun, Jul 21 2024 9:03 PM | Last Updated on Mon, Jul 22 2024 11:16 AM

Rakshit Shetty Request For Anticipatory Bail

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.  ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్‌ పార్టీ సినిమాలో తమ పాటలను కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న బ్యాచిలర్‌ పార్టీలో దిగంత్‌, అచ్యుత్‌ కుమార్‌, యోగేష్‌ వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీని అభిజిత్‌ మహేష్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్‌ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్‌ శెట్టి ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 61వ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరగగా బుధవారానికి వాయిదా వేసింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్‌ గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement