కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రాణస్నేహితులు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది.. ప్రముఖ నటులు విష్ణువర్ధన్, రెబల్ స్టార్ డా. అంబరీష్ మాత్రమే అని చెప్తారు. ఈ దిగ్గజాల తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వారి బంధానికి మించి అయితే కాదు అనే టాక్ ఉంది. ఈ క్రమంలో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టితో రక్షిత్ శెట్టి స్నేహ బంధం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది . ఒకరు కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారితే.. రక్షిత్ శెట్టి 'చార్లీ 777' సినిమాతో బాక్సాఫీస్ బద్దలుకొట్టారు. ఇలా వీరద్దరూ కన్నడ పరిశ్రమలో పాపులర్ యాక్టర్స్ అయిపోయారు.
(ఇదీ చదవండి: వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్‌తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది)
జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు, ఈ నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి ఒకే ప్లేట్‌లో భోజనం చేస్తున్న వీడియో రివీల్ అయింది. ఈ బ్యాచ్‌లో ప్రమోద్ శెట్టి కూడా ఉన్నారు. ఈ వీడియోను కన్నడ నటి శీతల్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా అందంగా ఉంది. కానీ ఇదీ పాతదని ఆమె తెలిపింది. ఈ వీడియో వారు సినిమా పరిశ్రమలో కష్టాలు ఎదుర్కొంటున్న నాటిదే అయినా.. వారి మధ్య ఉండే స్నేహం ఎంత బలమైనదో తెలుపుతుంది.
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కంటే ముందే రక్షిత్ శెట్టి సినీ పరిశ్రమలో ఉన్నారు. అప్పటికే ఆర్థికంగా మంచి స్థానంలో రక్షిత్ ఉన్నారు. మొదట 'తుగ్లక్' సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా జర్నీలో వీరు మంచి స్నేహితులుగా మారారు. 'తుగ్లక్' సినిమాతో హీరోగా రక్షిత్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. రిషబ్ కూడా ఒక చిన్న క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా రక్షిత్ శెట్టి చేసిన తొలి సినిమా ఇదే కావడం అది పరాజయం పాలవడం అతన్ని ఎంతగానో కుంగతీసింది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు డిప్రెషన్‌కు గురైయాడు.
(ఇదీ చదవండి: Anna Lezhneva Facts: అన్నా లెజెనెవా ఎవరు? పవన్‌కు ఎలా పరిచయమయ్యారు?)
దీంతో రిషబ్ వద్ద ఉన్న'కిరిక్ పార్టీ' కథను రక్షిత్‌కు చెప్పడంతో తనకు నచ్చింది. దానికి రిషబ్‌నే డైరెక్టర్‌గా తొలిసారి వ్యవహరించాడు. రక్షిత్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పెట్టాడు. విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద హిట్టయింది. దాని వల్ల వారికి భారీగా డబ్బు వచ్చింది. దాంతో ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ సినిమా తీశారు. దానికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డొచ్చింది. అలా వారిద్దరూ తిరిగి వెనకడుగు వేయలేదు. ప్రస్థుతం భారీ సినిమాల్లో నటించే స్థాయికి ఈ స్నేహితులు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment