రష్మికతో ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ : రక్షిత్‌ స్టేట్‌మెంట్‌ | Rakshit Breaks Silence On Rashmika Mandanna And Failed Engagement | Sakshi
Sakshi News home page

రష్మికతో ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ : రక్షిత్‌ స్టేట్‌మెంట్‌

Published Wed, Sep 12 2018 6:21 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Rakshit Breaks Silence On Rashmika Mandanna And Failed Engagement - Sakshi

రష్మికా మండన్నా-రక్షిత్‌ శెట్టి ఎంగేజ్‌మెంట్‌

తొలి సినిమా ‘ఛలో’, రెండో సినిమా‘గీత గోవిందం’తో తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్‌ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్‌ రష్మిక మందన్న.. టాలీవుడ్‌లోకి రాకముందు ఆమెకు కన్నడలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. టాలీవుడ్‌లోకి ప్రవేశించి, ఈ ఫాలోయింగ్‌ను, తన పాపులారిటీని మరింత పెంచేసుకుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సోషల్‌ మీడియాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. కన్నడలో తనకు విశేషమైన ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టిన ‘కిరిక్‌ పార్టీ’  చిత్రీకరణ సమయంలోనే నిర్మాత, సహ నటుడు రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. పెద్దల అంగీకారంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్‌ రద్దయింది. కారణాలు ఏమన్నది తెలియదు కానీ, ఈ ఇరువురు విడిపోయారు. 

వీరి ఎంగేజ్‌మెంట్‌ రద్దు కావడానికి కంటే ముందే వీరి పెళ్లి క్యాన్సిల్‌ అయిందని వార్తలొచ్చాయి. ఆ వార్తలను రక్షిత్ శెట్టి ఖండించాడు. అయితే నిన్న కన్నడ పాపులర్ న్యూస్ పేపర్ అధికారికంగా రష్మిక, రక్షిత్‌ల ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌ అయిందని ప్రకటించడంతో, సోషల్‌ మీడియాలో రష్మికను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టేశారు. రష్మిక, రక్షిత్‌ల ఎంగేజ్‌మెంట్‌ రద్దు కావడంపై ఆమె తల్లి కూడా తామిప్పుడు బాధలో ఉన్నట్టు చెప్పారు. రష్మికపై సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని తట్టుకోలేని రక్షిత్‌ శెట్టి, ఆమెను తప్పుపట్టందంటూ కోరుతూ ఫేస్‌బుక్‌లో ఓ పెద్ద పోస్టు పెట్టారు. 

‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మికా గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి. దయచేసి ఆమెను శాంతిగా ఉండనీయండి. త్వరలోనే ప్రతీది ఓ ముగింపుకు వస్తుందని నేను ఆశిస్తున్నా. నిజమేమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. మీడియా న్యూస్‌గా వెళ్లకండి. ఎవరూ కూడా నానుంచి, రష్మికా నుంచి సమాచారం పొందిలేరు. వారి అవసరానికి తగ్గట్టు వారు సొంత వార్తలు రాసుకున్నారు. అంచనాలు, ఊహాగానాలు నిజం కావు. కొన్ని రోజులు మాత్రమే ఈ పేజీ లైవ్‌లో ఉంటుంది. నేను సోషల్‌ మీడియా నుంచి వైదొలుగుతున్నా. ఒకవేళ నిజంగా అవసరం అనిపించినప్పుడు మళ్లీ సోషల్‌ మీడియాలోకి వస్తా. నేను కేవలం ఇప్పుడు పనిపైనే దృష్టిసారించనున్నా’ అని పేర్కొంటూ ఓ పెద్ద లెటరు రాసుకొచ్చారు. దీంతో నిన్నమొన్నటివరకూ వీరిద్దరి బ్రేకప్‌పై ఉన్న కన్ఫ్యూజన్ పోయి ఇద్దరూ విడిపోయారనే విషయంలో క్లారిటీ మాత్రం వచ్చింది. రష్మికను తప్పు పట్టదంటూ రక్షిత్‌ చేసిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రష్మికా మండన్నా-రక్షిత్‌ శెట్టి ఎంగేజ్‌మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement