Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్‌లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది.
హాస్టల్ కుర్రాళ్లు కేక
కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల‍్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్‌వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు.
(ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్)
స్టార్ హీరోలు సైలెంట్
ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్‌వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్‌గా క్యాచ్ చేసి, హిట్ అయింది.
కథేంటి?
గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ‍్బాయిల పేర్లు ఓ నోట్‌లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్‌ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర‍్య పడాల్సిన పనిలేదు.
స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్
హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్‌నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు.
(ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!)
Comments
Please login to add a commentAdd a comment