Hostel Hudugaru Bekagiddare Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసేందుకు రెడీ అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా ఈ శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు తొలుత ప్లాన్ చేశారు. అవన్నీ సైడ్ అయిపోవడంతో ఈసారి చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో సినీ ప్రేమికుల దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు ఏకంగా 30 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 10వరోజు హైలైట్స్.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!) సోమవారం ఓటీటీ లిస్టు అనుకున్నప్పుడు 32 వరకు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్ కోసం.. భోళా శంకర్, MY3, రామబాణం, మాయపేటిక, హాస్టలు హుడుగురు బేకాగిద్దరే లాంటి మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ విలేజ్ - మలయాళ సినిమా సుబేదార్ - మరాఠీ చిత్రం మిలియన్ మైల్స్ ఎవే - ఇంగ్లీష్ మూవీ వైల్డర్నెస్ - ఇంగ్లీష్ సిరీస్ అనీతి - తెలుగు డబ్బింగ్ మూవీ ద ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) బంబై మేరీ జాన్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ Myత్రీ - తెలుగు డబ్బింగ్ సినిమా కాలా - హిందీ సిరీస్ ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ - ఇంగ్లీష్ సినిమా ద అదర్ బ్లాక్ గర్ల్ - ఇంగ్లీష్ సిరీస్ ఆహా మాయపేటిక - తెలుగు సినిమా నెట్‌ఫ్లిక్స్ భోళా శంకర్ - తెలుగు చిత్రం ఎల్ కొండే - స్పానిష్ మూవీ ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - ఇంగ్లీష్ సినిమా మిస్ ఎడ్యుకేషన్ - ఇంగ్లీష్ సిరీస్ సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ ద క్లబ్: పార్ట్ 2 - టర్కిష్ సిరీస్ డైరీస్ సీజన్ 2: పార్ట్ 1 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్) థర్స్ డేస్ విడోస్ - స్పానిస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ - డానిష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) వన్స్ అపాన్ ఏ క్రైమ్ - జపనీస్ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) రామబాణం - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!) జీ5 హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే - కన్నడ సినిమా సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ - మలయాళ చిత్రం బుక్ మై షో ఏ హనీమూన్ టూ రిమెంబర్ - ఇంగ్లీష్ చిత్రం మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ - ఇంగ్లీష్ సినిమా ఈ-విన్ దిల్ సే - తెలుగు సినిమా (సెప్టెంబరు 16) సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ - మలయాళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) -
ఓటీటీలోకి హాస్టల్ కుర్రాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే బాగుంటే.. ప్రాంతీయ సినిమాల్ని భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఓ కన్నడ సినిమా.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. కొన్నిరోజుల ముందు మన దగ్గర థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. పైన చెప్పినదంతా కూడా 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' గురించే. కన్నడలో జూలై 21న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా స్టార్స్ ఎవరూ నటించలేదు. సినిమాలో ఉన్నదంతా కుర్రాళ్లే. అయినా సరే హాస్టళ్ల కుర్రాళ్ల కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూడు రెట్ల లాభాలు అందించారు. దీంతో తెలుగులోని డబ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఓటీటీ డేట్ అదే కన్నడలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 26న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'బాయ్స్ హాసల్' పేరుతో రిలీజ్ చేశారు. ఏమైందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు.. దీన్ని థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జీ5లో సెప్టెంబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఓటీటీలో కాబట్టి తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్సవరు. కథేంటి? హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: మంచు విష్ణు సినిమాలో ప్రభాస్.. కారణం అదా?) -
తెలుగు ప్రేక్షకులకు దండం పెట్టాలి: సుప్రియ
‘‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన తెలుగువాళ్లే. మంచి సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. అందుకే మన ప్రేక్షకులకి దండం పెట్టాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో, అతిథిగా రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’గా అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలు చేశారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ చెప్పిన విశేషాలు. ► ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ సినిమాని అనువదించడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వందకు పైగా వాయిస్‌లు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి వాయిస్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు డబ్ చేశాం. ‘బాయ్స్ హాస్టల్’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్లు సినిమాలను చాలా చక్కగా చేస్తున్నారు.. అందుకే వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ► వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘మనం’ సినిమా షూటింగ్ మరో పది రోజులు ఉందనగా తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు చేశారు. ‘మనం’ ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలనుకున్నపుడు ఎంతో ఒత్తిడి ఉండేది. రోజుకు 22 గంటలు పని చేశాం. అయితే ఆ టైమ్‌లో ఎవరితోనూ తిట్టించుకోవడం గొప్ప విషయం (నవ్వుతూ). తాతగారు ఇప్పటికీ నెలకోసారి కలలోకి వచ్చి నన్ను తిడుతుంటారు (నవ్వుతూ). ► నాగార్జునగారి కంటే మంచి నిర్మాత ఎవరూ లేరు. ఆయన యాక్టర్ అవ్వడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ప్రారంభమైన కొత్తల్లో కరెంటు బిల్లు కూడా కట్టేంత ఆదాయం వచ్చేది కాదు. తాత, అమ్మమ్మ (ఏఎన్ఆర్–అన్నపూర్ణ) బాధ పడేవారు. ఇప్పుడు ఈ స్టూడియో ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జునగారి కృషి ఉంది. నాకు యాక్టింగ్ వస్తుందా? రాదా అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ). ‘గూఢచారి 2’లో నా పాత్ర ఉంటే నటిస్తాను. మా బ్యానర్లో నాగచైతన్య, అఖిల్‌లతో ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. -
అందుకే అందరూ కనెక్ట్ అవుతారు
‘‘బాయ్స్ హాస్టల్’ కథకు యూనివర్సల్ అప్పీల్ ఉంది. ప్రపంచంలో హాస్టల్స్ అన్ని చోట్ల ఉన్నాయి. అందుకే ఇందులోని పాత్రల్ని అందరూ రిలేట్ చేసుకుంటారు. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని డైరెక్టర్ నితిన్ కృష్ణమూర్తి అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ నెల 12న కన్నడలో విడుదలైన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నితిన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బాయ్స్ హాస్టల్’ నా తొలి చిత్రం. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి చక్కని మ్యూజిక్ చేశారు. తెలుగు నేటివిటీ కోసం రష్మి, తరుణ్ భాస్కర్గారి పాత్రల్ని రీ షూట్ చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ లాంటి సంస్థల ద్వారా తెలుగులోకి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!
Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. హాస్టల్ కుర్రాళ్లు కేక కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్‌వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) స్టార్ హీరోలు సైలెంట్ ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్‌వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్‌గా క్యాచ్ చేసి, హిట్ అయింది. కథేంటి? గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్‌నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!)