ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే బాగుంటే.. ప్రాంతీయ సినిమాల్ని భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఓ కన్నడ సినిమా.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. కొన్నిరోజుల ముందు మన దగ్గర థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.
పైన చెప్పినదంతా కూడా 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' గురించే. కన్నడలో జూలై 21న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా స్టార్స్ ఎవరూ నటించలేదు. సినిమాలో ఉన్నదంతా కుర్రాళ్లే. అయినా సరే హాస్టళ్ల కుర్రాళ్ల కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూడు రెట్ల లాభాలు అందించారు. దీంతో తెలుగులోని డబ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
ఓటీటీ డేట్ అదే
కన్నడలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 26న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'బాయ్స్ హాసల్' పేరుతో రిలీజ్ చేశారు. ఏమైందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు.. దీన్ని థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జీ5లో సెప్టెంబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఓటీటీలో కాబట్టి తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్సవరు.
కథేంటి?
హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ‍్బాయిల పేర్లు ఓ నోట్‌లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్‌ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: మంచు విష్ణు సినిమాలో ప్రభాస్.. కారణం అదా?)
Comments
Please login to add a commentAdd a comment