తెలంగాణ నేపథ్యంలో ఓటీటీ కోసం మొదటిసారి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'వికటకవి' అనే టైటిల్‌తో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. సుమారు నాలుగు దశాబ్ధాలుగా పట్టి పీడించే శాపానికి సంబంధించిన కథతో 'వికటకవి' వెబ్ సిరీస్ ఉన్నట్లు సమాచారం.
'వికటకవి' తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలతో చాలా గ్రిప్పింగ్‌గా కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్వాతంత్య్రం రాక మునుపు మన దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. రైటర్ తేజ డిఫరెంట్ కథను చెప్పాలనుకున్నప్పుడు తన మైండ్‌లో వచ్చిన ఐడియానే ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్న క్రమంలో కొన్నాళ్లలో ఆ ప్రాంతంలోని ఒక ఊరు మునిగిపోతుంది.. ఈ బ్యాక్ డ్రాప్ కథతో వికటకవి అనే ఫిక్షనల్ పాయింట్‌ను మేకర్స్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment