
చండీగఢ్ : టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సోదరి, మరిదిపై సోనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తన సోదరి రుకేష్, మరిది అమన్ పుణియాలు తనను చంపుతానని బెదిరించారని సోనాలి ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే.. సోనాలి మంగళవారం తన స్వగ్రామం భూతాన్ కలాన్‌కు వెళ్లారు. ఆ రోజు రాత్రి పలువురు బీజేపీ నాయకులు ఆమెను కలిశారు. అలాగే సోనాలి సోదరి, మరిది కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వారు సోనాలితో గొడవకు దిగారు. ఈ సమయంలో వారు తనను దూషించడంతో పాటు.. చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని సోనాలి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి.. విచారణ చేపడతామన్నారు. కాగా, ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన సోనాలి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment