
గంగూలీకి బెదిరింపు లేఖ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈనెల 19న మిడ్నాపూర్‌లోని విద్యాసాగర్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ కాలేజి క్రికెట్ మీట్
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈనెల 19న మిడ్నాపూర్‌లోని విద్యాసాగర్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ కాలేజి క్రికెట్ మీట్‌లో ‘దాదా’ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటే అంతు చూస్తామంటూ గంగూలీని బెదిరించారు. ‘నీ కొడుకును మేం హెచ్చరిస్తున్నాం. క్రికెట్ మీట్‌కు వస్తే మాత్రం అతడిని మరోసారి నీవు చూడలేవు’ అని గంగూలీ తల్లి నిరూపాకు పంపిన ఈ లేఖలో హెచ్చరించాడు. ఈనెల 7న ఈ లేఖ వచ్చిందని, విషయాన్ని పోలీసులకు తెలిపినట్టు గంగూలీ ధృవీకరించారు. అయితే అక్కడికి వెళ్లాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.