కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సం నాటి ఘటనతో రైతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖలు మద్దతిస్తుండగా.. మన దేశంలో సెలబ్రిటీలు మాత్రం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతలకు మద్దతిస్తోన్న తనపై అత్యాచార చేస్తామని.. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బ్రిటీష్ నటి జమీలా జమిల్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘గత కొన్ని నెలలుగా నేను తరచుగా భారతీయ రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నాను. ఫలితంగా నేను బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి.. నేనూ మనిషినే.. కొంతవరకే దేన్ని అయినా భరించగలను. రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను.. ఇక మీదట కూడా తెలుపుతాను. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారు తమ న్యాయమైన హక్కుల కోసం పొరాడుతున్నారని గుర్తించండి’’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది.
ఇక జమీలా విషయానికి వస్తే.. ఆమె తండ్రి అలీ జమిల్ భారత సంతతి వ్యక్తి కాగా.. తండ్రి షిరీన్ జమిల్ పాక్ సంతతి మహిళ. ఇక జమీలా 2009లో టీ4తో తన టెలివిజన్ కెరీర్ స్టార్ట్ చేసింది. 2012 వరకు సాగిన ఈ పాప్ కల్చర్ సిరీస్ జమీలా హోస్ట్‌గా పని చేసింది. ఇక ఎన్‌బీసీలో వచ్చిన ఫాంటసీ కామెడీ సిరీస్ ది గుడ్ ప్లేస్ లో తహాని అల్-జమీల్ పాత్రతో బాగా పాపులర్ అయ్యింది.
చదవండి: ‘పోలీసుల దెబ్బలకు రైతుల కాళ్లు కమిలిపోయాయి’
రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు
Comments
Please login to add a commentAdd a comment