సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చేసిన హెచ్చరికలను కండలవీరుడు తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు సల్మాన్ ఖాన్ కోర్టుకు వచ్చిన సందర్భంలో స్ధానిక గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ హెచ్చరికల నేపథ్యంలో ముంబయిలోని ఫిల్మ్ సిటీలో రేస్ 3 షూటింగ్‌ను నిలిపివేసిన పోలీసులు పటిష్ట భద్రత నడుమ ఇంటికి తీసుకువెళ్లారు.
అయితే భారీ భద్రత నడుమ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి సల్మాన్ ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నట్టు తెలిసింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో సల్మాన్‌తో పాటు జాకీ, డైసీషా, అనిల్ కపూర్, బాబీ డియోల్, ఫ్రెడీ దరువలాలు పాల్గొంటారు. టైటిల్ సాంగ్ చిత్రీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక సెట్‌లో షూట్ చేయనున్నారు. వచ్చే నెలలో చిత్ర యూనిట్ బ్యాంకాక్, దుబాయ్, అబుదాబిలో భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment