న్యూడ్‌ ఫొటో షూట్‌: ఫొటోగ్రాఫర్‌కు బెదిరింపులు | Death Threats for Wedding Photographer who shot in the Nude | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 25 2018 3:56 PM | Last Updated on Sat, Aug 25 2018 4:23 PM

Death Threats for Wedding Photographer who shot in the Nude - Sakshi

ప్రీతమ్‌, అతను తీసిన ఫొటో

కోల్‌కతా: వైవిధ్యంగా ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో చేసిన పని ఓ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. కోల్‌కతాకు చెందిన ప్రీతమ్‌ మిత్రా అనే ఓ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌. ఇటీవల ఓ మోడల్‌తో ఫొటోషూట్‌ నిర్వహించాడు. అయితే అది సాధారణ ఫొటోషూట్‌ అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మోడల్‌ను పెళ్లికూతురుగా, బెంగాల్‌ స్టైల్‌లో పెద్ద బొట్టుతో అలంకరించి న్యూడ్‌ ఫొటోలు తీశాడు. ఆ మోడల్‌ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో జాగ్రత్తపడ్డాడు. అలాగే ఆమె ప్రయివేట్‌ పార్ట్స్‌ కనిపించకుండా జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఫొటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది.

ఈ ఫొటో బెంగాల్‌ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను.. ఆ ఫేస్‌బుక్‌ పేజీని తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని పిలుపునిస్తున్నారు. గత వారం రోజులుగా వస్తున్న ఈ బెదిరింపులకు భయపడ్డ ప్రీతమ్‌ రక్షణ కల్పించాలని కోల్‌కతా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఏదో చేద్దామని చేసిన పని ప్రీతమ్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. గత ఐదేళ్లుగా ప్రీతమ్‌ ఫ్రొఫెషనల్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వ్యవహారం కూడా రచ్చైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement