‘ప్రేమ యాత్రలకు బృందావనము.. నందనవనమూ యేలనో.. ప్రేమించిన చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో’ అన్నాడో కవి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వృద్ధ దంపతులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తమ ఒక్కగానొక్క కూతురు విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న జంట ఎక్కడికి వెళ్లినా ఒకరి చేయి విడిచి ఒకరు ఉండరు. అంతేకాదు వెళ్లిన ప్రతీచోటు చిరకాలం గుర్తుండిపోయేలా ఫొటోలు దిగి ఆనందపు క్షణాలను ఫోన్‌లో భద్రపరచుకుంటారు.
తాజాగా ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ క్యూట్ కపుల్ ఓ పూజా మంటపానికి వెళ్లారు. ధోతి కుర్తాలో తాతయ్య మెరిసిపోగా.. సంప్రదాయ చీరకట్టులో బామ్మ హుందాగా కనిపించారు. ముచ్చటగా సెల్ఫీలు దిగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. వీళ్లను గమనిస్తున్న అంజన్ బెనర్జీ అనే నెటిజన్.. ఈ వృద్ధ జంటకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వేలల్లో లైకులు సాధిస్తున్న వీరి ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అందమైన జంట. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని నిరూపించారు. రెండు ఆత్మలు ఒక్కటైనప్పుడు శరీరంతో పనిలేదు కదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment