నమ్మకం ముఖ్యం | Varun Dhawan talks about the death threats given to Natasha Dalal | Sakshi
Sakshi News home page

నమ్మకం ముఖ్యం

Published Mon, Apr 15 2019 12:06 AM | Last Updated on Mon, Apr 15 2019 12:06 AM

Varun Dhawan talks about the death threats given to Natasha Dalal - Sakshi

వరుణ్‌ ధావన్‌

ప్రేమ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. భిన్న నిర్వచనాలు ఉంటాయి. మరి..‘మీ దృష్టిలో ప్రేమంటే ఏం చెబుతారు?’ అన్న ప్రశ్నను వరుణ్‌ ధావన్‌ ముందు ఉంచితే...‘‘నా దృష్టిలో ప్రేమ అంటే కుటుంబ సభ్యులను ప్రేమించడం. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా నిజాయతీతో పాటు నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మన మనసు కచ్చితంగా బాధపడాల్సి వస్తుంది.

ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వారితో చనిపోవడానికైనా సిద్ధపడే మనస్తత్వం ఉంటుంది. కానీ అది వాస్తవంలో చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చారు. తాను త్వరలో ఓ బయోపిక్‌లో నటించ బోతున్నట్లు వరుణ్‌ ధావన్‌ వెల్లడించారు. అభిషేక్‌వర్మన్‌ దర్శకత్వంలో వరుణ్‌ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘కళంక్‌’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకొస్తే... తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో వరుణ్‌ ధావన్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement