Bigg Boss 14 Rahul Vaidya Gets Death Threats For Garbe Ki Raat Song - Sakshi
Sakshi News home page

Rahul Vaidya: సింగర్‌ రాహుల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌

Published Sun, Oct 17 2021 3:06 PM | Last Updated on Sun, Oct 17 2021 3:18 PM

Rahul Vaidya Gets Death Threats For Garbe Ki Raat Song - Sakshi

Rahul Vaidya Gets Death Threats : ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌14 రన్నరప్‌ రాహుల్‌ వైద్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలె నవరాత్రి స్పెషల్‌ సందర్బంగా రాహుల్‌  ‘గర్బే కి రాత్’అనే పాటను కంపోజ్‌ చేశాడు. రాహుల్‌, భూమి త్రివేది కలిసి పాడిన ఈ పాట విడుదలైన కాసేపటికే తీవ్ర వివాదాస్పదం అయ్యింది. తమ మనోభావాలను కించపరిచే విధంగా పాటను కంపోజ్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 


ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' అనే పదాన్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ గుజరాతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఆచారాలను కించపరిచారనే కారణంతో రాహుల్‌, భూమి త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదని, రాహుల్‌ను కొడతం, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయంటూ రాహుల్‌ టీం పేర్కొంది.


మనోబావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఆ పదాలు తీసేయడానికి తమ బృందం పని చేస్తుదని తెలిపారు. అప్పటివరకు అందరూ శాంతంగా ఉండాలని, దాన్ని సరిదిద్దడానికి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. 

చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్‌?
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement