ముంబై : హోటళ్ల వ్యాపారి బీఆర్ శెట్టిపై హత్యాయత్నం, దోపిడీ కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర ఎస్ నిఖల్జీకి న్యాయస్ధానం మంగళవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో చోటా రాజన్‌తో పాటు ఐదుగురు ఇతరులకు మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరధోక చట్ట ప్రత్యేక న్యాయస్ధానం (మోకా) ఈ శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇది చోటా రాజన్ దోషిగా తేలిన మూడవ కేసు కావడం గమనార్హం. ముంబైలోని అంబోలి ప్రాంతంలో బీఆర్ శెట్టిపై రాజన్ అనుచరులు 2013లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. 2015లో ఇండోనేషియాలోని బాలి నుంచి మాఫియా డాన్ చోటా రాజన్‌ను భారత్‌కు రప్పించగా, ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు. చోటా రాజన్ దోపిడి, హత్య, హత్యాయత్నం వంటి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. చోటా రాజన్ ఇప్పటికే పాస్‌పోర్టు కేసులో దోషిగా తేలగా, ముంబైలో జేడే హత్య కేసులోనూ ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో రాజన్ సహా మరో ఎనిమిది మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment