సాక్షి, ముంబై: పరారీలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను అధికారులు మంగళవారం వేలం వేశారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజి మానిప్యులేటర్స్ చట్టం(ఎస్‌ఎఎఫ్‌ఈఎంఇ) కింద ఆరు ఆస్తులకు వేలం నిర్వహించారు. ఈ ఆస్తులను దాదాపు రూ.23 లక్షలకు వేలం వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వేలానికి అద్భుతమైన స్పందన వచ్చిందని రత్నగిరిలోని ఆరు ఆస్తులు విజయవంతంగా అమ్ముడయ్యాయని ఉన్నతాధికారి ఆర్.ఎన్.డిసౌజా వెల్లడించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, సీల్‌డ్ టెండర్ ద్వారా ముంబైలో నిర్వహించిన వేలంలో న్యాయవాది శ్రీవాస్తవతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది భూపేంద్ర భరద్వాజ్‌లు వాటిని దక్కించుకున్నారు.
డిసౌజా ప్రకారం మిలిగిన ఆస్తులు రిజర్వ్ ధరకే అమ్ముడుకాగా, బ్లాక్‌లోని రెండు ఆస్తులలు రిజర్వ్ ధరల కంటే చాలా ఎక్కువ రూ .1.89 లక్షలు (రూ. 5.35 లక్షలకు అమ్ముడయ్యాయి), రూ .4.30 లక్షలు (రూ. 11.20 లక్షలకు అమ్ముడయ్యాయి). అయితే దావూద్ మాజీ సహాయకుడు ఇక్బాల్ మెమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చికి చెందిన ముంబైలోని శాంటాక్రూజ్ వెస్ట్‌లోని మిల్టన్ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లను వేలానికి ఉంచినా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈమొత్తంలో 25 శాతం వారంలోపు, మరో 25 శాతం నెలలోపు, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి మూడు నెలల్లో జమ చేయాలని డిసౌజా వివరించారు. పూర్తిగా చెల్లించిన తరువాత కొనుగోలుదారుడికి ప్రాపర్టీ సొంతం అవుతుందని డిసౌజా స్పష్టం చేశారు.
2019, ఏప్రిల్‌లో దావూద్ సోదరి హసీనా పార్కర్‌కు చెందిన నాగ్‌పాడాలోని గోర్డాన్ హాల్ అపార్ట్‌మెంట్‌లో 600 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ .1.80 కోట్లకు వేలం వేసింది. (2014 లో హసీనా మరణించడంతో దీన్ని ఆమె సోదరుడు ఇక్బాల్ కస్కర్ దీన్ని ఆక్రమించారు. అయితే ఇక్బాల్‌ను 2017 లో థానే పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలులో ఉన్నాడు). 2018 లో దక్షిణ ముంబైలోని అమీనా మాన్షన్‌లో ఉన్న దావూద్ మరో మరొక ఆస్తిని రూ .79.50 లక్షల రిజర్వు ధరకంటే ఎక్కువగా రూ.3.51 కోట్లకు సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ కొనుగోలు చేసింది. 2017, నవంబర్‌లో, దక్షిణ ముంబైలోని ఆరు ఫ్లాట్లను, షబ్నం గెస్ట్ హౌస్ , రౌనాక్ ఆఫ్రోజ్ రెస్టారెంట్‌ను వేలం ద్వారా మొత్తం 11.50 కోట్లకు సేఫ్మా విక్రయించింది. రత్నగిరి జిల్లా, ఖేద్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని ముంబేక్ గ్రామంలో వేలం నిర్వహించిన ఈ ఆస్తుల్లో చిన్న నిర్మాణాలు, ప్లాట్ల రూపంలో భూమి ఉంది. సీజ్ చేసిన ఈ మొత్తం 13 ఆస్తులను ఈ ఏడాది ఆరంభంలోనే సేఫ్మా కింద వేలం నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించారు. కానీ కోవిడ్-19 మహమ్మారి,లాక్‌డౌన్‌తో వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment