అల్లుడి పెళ్లికి దావూద్‌ ఇబ్రహిం! | Big Mumbai Wedding Tomorrow For Dawood Ibrahim's Nephew | Sakshi
Sakshi News home page

అల్లుడి పెళ్లికి దావూద్‌ ఇబ్రహిం!

Published Tue, Aug 16 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

అల్లుడి పెళ్లికి దావూద్‌ ఇబ్రహిం!

అల్లుడి పెళ్లికి దావూద్‌ ఇబ్రహిం!

ప్రస్తుతం పాకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కరడుగట్టిన నేరగాడు, మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహిం గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడయింది.

ముంబై
ప్రస్తుతం పాకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కరడుగట్టిన నేరగాడు, మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహిం గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడయింది. ముంబైలో బుధవారం జరగబోయే తన మేనల్లుడి వివాహాన్ని ఇతడు వీడియో కాలింగ్‌ సర్వీస్‌ ‘స్కైప్‌’ ద్వారా చూస్తాడని తెలిసింది. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ కొడుకు అలిషా పర్కర్‌ ముంబైకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెను పెళ్లాడుతున్నాడు. ముంబైలోని ఒక మసీదు నిర్వహించే నిఖాకు కేవలం 15 మంది మాత్రమే హాజరవుతున్నారు. దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ వంటి కొందరు బంధువులు మాత్రమే నిఖాకు వస్తారని భావిస్తున్నారు. 
 
బలవంతపు వసూళ్లు, దాడుల కేసులో జైలు జీవితం అనుభవించిన కస్కర్‌ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. కరాచీ నుంచి స్కైప్‌ ద్వారా దావూద్‌ పెళ్లి వేడుకలను చూస్తారని ఇతని కుటుంబ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఖా పరిసరాల్లో భారీ నిఘా పెట్టారని పేరు  ఓ అధికారి తెలిపారు. ముంబైలో 1993లో 257 మంది మృతికి కారణమైన మతఘర్షణల కేసులో దావూద్‌కు ప్రమేయమున్నట్టు తేలడంతో ఇతడు భారత్‌ నుంచి పారిపోయాడు. పాకిస్తాన్‌ నుంచే తన డి కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement