Alishah Parkar
-
పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి
-
పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి
ముంబై: పోలీసుల నిఘా మధ్య మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషా పార్కర్ వివాహం బుధవారం జరిగింది. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కుమారుడైన అలిషా నగరంలోని వ్యాపారవేత్త షిరాజ్ ఏ కుమార్తె ఆయేషా నాగానిని పెళ్లాడాడు. దక్షిణ ముంబైలోని నాగపడా ప్రాంతంలోని రసూల్ మసీదులో జరిగిన వీరి వివాహానికి వధూవరుల కుటుంబాలకు చెందిన సభ్యులు, ఆహ్వానిత బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం రాత్రి జుహు ప్రాంతంలోని తులిప్ స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేనల్లుడి వివాహాన్ని స్కైప్ ద్వారా దావూద్ చూసే అవకాశముందని వార్తలు వచ్చాయి. కాగా, పెళ్లికి వచ్చిన వారి కదలికలను పోలీసులు నిశితంగా గమనించారు. అతిథులు వాహనాల నంబర్లు నమోదు చేసుకున్నారు. పెళ్లి, రిసెప్షన్ కు మీడియాను అనుమతించలేదు. -
అల్లుడి పెళ్లికి దావూద్ ఇబ్రహిం!
ముంబై ప్రస్తుతం పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కరడుగట్టిన నేరగాడు, మాఫియాడాన్ దావూద్ ఇబ్రహిం గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడయింది. ముంబైలో బుధవారం జరగబోయే తన మేనల్లుడి వివాహాన్ని ఇతడు వీడియో కాలింగ్ సర్వీస్ ‘స్కైప్’ ద్వారా చూస్తాడని తెలిసింది. దావూద్ సోదరి హసీనా పార్కర్ కొడుకు అలిషా పర్కర్ ముంబైకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెను పెళ్లాడుతున్నాడు. ముంబైలోని ఒక మసీదు నిర్వహించే నిఖాకు కేవలం 15 మంది మాత్రమే హాజరవుతున్నారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ వంటి కొందరు బంధువులు మాత్రమే నిఖాకు వస్తారని భావిస్తున్నారు. బలవంతపు వసూళ్లు, దాడుల కేసులో జైలు జీవితం అనుభవించిన కస్కర్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. కరాచీ నుంచి స్కైప్ ద్వారా దావూద్ పెళ్లి వేడుకలను చూస్తారని ఇతని కుటుంబ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఖా పరిసరాల్లో భారీ నిఘా పెట్టారని పేరు ఓ అధికారి తెలిపారు. ముంబైలో 1993లో 257 మంది మృతికి కారణమైన మతఘర్షణల కేసులో దావూద్‌కు ప్రమేయమున్నట్టు తేలడంతో ఇతడు భారత్ నుంచి పారిపోయాడు. పాకిస్తాన్ నుంచే తన డి కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.