
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని ఓ ఆస్తిని రూ.3.51 కోట్లకు ఓ ట్రస్టు సొంతం చేసుకుంది. దక్షిణ ముంబై బెండీ బజార్ ప్రాంతంలోని మసుల్లా అనే 4 అంతస్తుల భవనాన్ని వేలంలో దక్కించుకున్నామనిది సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ (ఎస్‌బీయూటీ) ప్రతినిధి శుక్రవారం తెలిపారు.
కేంద్ర ఆర్థికశాఖ ఈ వేలాన్ని నిర్వహించింది. మూడు ప్రక్రియల్లో జరిగిన వేలంలో ఈ–టెండరింగ్‌లో రూ.3.43 కోట్లకు ఎస్‌బీయూటీ బిడ్‌ను దాఖలు చేసింది. కాగా చివర్లో 3.51 కోట్ల ధరకు ఖరారు చేశారు. దీనిపై ఎస్‌బీయూటీ ప్రతినిధి మాట్లాడుతూ.. మసుల్లా భవనం నివాస యోగ్యం కాదని వెల్లడించారు. అయితే త్వరలోనే బెండీ బజార్ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఈ భవనాన్ని పునర్ నిర్మించునున్నట్లు తెలిపారు.