దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ షాక్
► ఆస్తులు జప్తు చేసిన యూకే
లండన్: అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన దావూడ్‌కు మింగుడు పడని పని చేసింది. తాజాగా బ్రిటన్ విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దీంతో పెద్ద మొత్తంలో ఇబ్రహీం ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది, ఇది భారత ప్రభుత్వానికి పెద్ద దౌత్య విజయం లాంటిది.
వివరాల్లోకి వెళ్తే దావూద్‌కు వార్విక్‌షైర్‌లో హోటల్, మిడ్‌ల్యాండ్‌లో నివాస ఆస్తులు ఉన్నాయి. చాలాకాలంగా దావూద్‌పై ఆర్ధిక ఆంక్షలు విధించాలని భారత్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ దావూద్ ఆస్తులను జప్తు చేసింది. గతంలో యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్స్ టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్‌కు పాకిస్తాన్‌లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు.