ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. నేడు ముంబైలోని టాడా కోర్టులో అతన్ని హాజరు పరచనున్నారు. ఫరూఖ్ ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడు. ఇతనిపై తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై కేసులు నమోదయ్యాయి.
1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దుబాయి పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. దావూద్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ దుబాయ్ వేదికగా మాఫియా నడపడంలో ఫరూఖ్‌ది కీలకపాత్ర. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment