
దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)
ఠాణే : పాకిస్తాన్‌లో తల దాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డిప్రెషన్‌తో నలిగిపోతున్నట్లు తెలిసింది. డబ్బు, గన్ పవర్స్ ఉన్నా.. కుటుంబ వ్యవహారాలతో సతమతమవుతున్నట్లు పోలీసులకు రిపోర్టులు అందాయి. తన ఒకే ఒక్క తనయుడు మోయిన్ నవాజ్(31)తోనే దావూద్ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వారసత్వాన్ని కొనసాగించేందుకు నవాజ్ ‘నో’ చెప్పడంతో దావూద్ కుమిలిపోతున్నట్లు సమాచారం.
తాను మత ప్రభోదకుడిగా మారిపోతానని మోయిన్ నవాజ్ దావూద్‌కు చెప్పినట్లు తెలిసింది. చట్టవిరుద్ద కార్యకలాపాలు చేసేందుకు మోయిన్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. నవాజ్‌కు ఖురాన్‌పై మంచి పట్టు ఉందని కూడా తెలిసింది. మత ప్రభోదకుడు కావడం నవాజ్ చిన్ననాటి కోరిక అని కూడా సమాచారం. అందుకోసం ఇంటికి దగ్గరలోని మసీదులోనే నవాజ్ నివాసం ఉంటున్నాడని తెలిసింది.