భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు దావూద్‌ అనుచరులు? | Dawoods aides expected at India vs Pakistan Asia Cup match | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు దావూద్‌ అనుచరులు?

Published Tue, Sep 18 2018 3:54 PM | Last Updated on Tue, Sep 18 2018 4:04 PM

Dawoods aides expected at India vs Pakistan Asia Cup match - Sakshi

దుబాయ్‌: భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ఈ క్రమంలో మ్యాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందే స్టేడియంలోని టిక్కెట్లన్నీ అమ్ముడుపోతాయి. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు కూడా వస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీషు మీడియా కథనాన్ని ప్రచురించింది.

దాంతో ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దృష్టిసారించాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు, అతని కుటుంబ సభ్యులు వస్తున్నట్లు ఈ ఆరు ఏజెన్సీలు వెల్లడించడం గమనార్హం. ఇండో-పాక్ మ్యాచ్ గురించి ఓ కీలక సమాచారం ఇంటెలిజెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అందింది. మరొకవైపు డీ గ్యాంగ్‌తో సన్నిహితంగా ఉండే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారని వాళ్లకు సమాచారం తెలిసింది. దీనిలో భాగంగా పలు దేశాలకు చెందిన నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement