న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్‌కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్‌లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్‌కు చెందిన దావూద్, సలాహుద్దీన్‌లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్‌లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్‌లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్‌ను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment