hand over the
-
ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికుల చేతికి చిక్కిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులను చైనా శుక్రవారం అప్పగించింది. చైనా సరిహద్దులో వీరిని భారత సైన్యానికి అప్పగించింది. అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకుల జాడ తెలిసిందని, వారిని చైనా శుక్రవారం అప్పగిస్తానని తెలిపిందని ఇటీవల కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆ ఐదుగురు భారతీయ పౌరులను చైనా విడిచిపెట్టింది. ఆ ఐదుగురు అడవిలో వేటకు వెళ్లి పొరపాటుగా వాస్తవాధీన రేఖను దాటినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. శుక్రవారం ఉదయం కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. వారితో పాటు అడవిలోకి వెళ్లిన మరో ఇద్దరు ఈ విషయాన్ని వారి కుటుంబాలకు తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి వారిని విడిచిపెట్టడానికి అంగీకరించారు. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా అనంతరం వారు తమ వద్దే ఉన్నట్లు ప్రకటించి విడుదల చేసింది. చైనా సైన్యం విడుదల చేసిన యువకులను తోచ్ సింగ్కం, ప్రసాత్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బేకర్, న్గారు దిరిగా గుర్తించారు. చదవండి: భారత్- చైనా: 5 అంశాల్లో కుదిరిన ఏకాభిప్రాయం! -
దావూద్, సలాహుద్దీన్‌లను అప్పగించాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్‌కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్‌కు చెందిన దావూద్, సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్‌లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్‌లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్‌ను కోరుతోంది. -
పంట భూములను పరిశ్రమలకు అప్పగించం
∙ఆందోళన వ్యక్తం చేసిన ఎలుకుర్తి రైతులు ఎలుకుర్తి (ధర్మసాగర్) : పరిశ్రమల స్థాపనకు ఎట్టి పరిస్థితుల్లోను తమ పంట భూములను అప్పగించేది లేదని మండలంలోని ఎలుకుర్తి, నర్సింగరావుపల్లి గ్రామాల రైతులు గురువారం ఎలుకుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు సంతకాలు కూడా సేకరించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించాలని కోరుతూ రైతులు సర్పంచ్ గుండవరపు రాంచందర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు.