ముంబై: ముంబైలోని దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం నేపథ్యంలో అతని అనుచరురు ఒక చానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసి బెదిరించారు. కరాచీ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ లో ఉస్మాన్ చౌదరీగా పరిచయం చేసుకున్న దావూద్ అనుచరుడు.. వేలం స్థలాల్లో ఏ నిర్మాణాలు కట్టనివ్వమని బెదిరించాడు. ‘1993 నాటి పేలుళ్లు మరిచిపోయారా?. అంతకంటే పెద్ద దాడి చేస్తాం’ అని హెచ్చరించాడు.
ఆస్తుల్ని వేలం వేయడంపై దావూద్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని పేర్కొన్నాడు. దావూద్, అతని అనుచరుడి మధ్య ఫోన్ సంభాషణను ప్రసారం చేసిన అనంతరం చానల్ రిపోర్టర్‌కు ఈ ఫోన్ కాల్ వచ్చింది. మరోవైపు దక్షిణ ముంబైలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన ఆస్తులను వేలం వేయగా రూ.11.58 కోట్లు వచ్చింది. సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్టు వీటిని సొంతం చేసుకుంది. వీటిలో ఢిల్లీ జైకా(రానక్ అఫ్రోజ్) అనే హోటల్ రూ.4.53 కోట్లు, షబ్నామ్ గెస్ట్ హౌస్ రూ.3.52 కోట్లు, దామర్వాలా భవంతిలోని ఆరు గదులు రూ.3.53 కోట్ల ధరలు పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment